ఒక్క సినిమా చాలు తలరాతలు మారడానికి.ఒక మాములు రైటర్ గా కెరీర్ ను ప్రారంభించారు కొరటాల శివ.
ఆయన పని చేసిన సినిమాల్లో ఆయనకి క్రెడిట్ కూడా దక్కలేదు ఒక్కప్పుడు.మరి ఇప్పడో?
తీసింది రెండంటే రెండే చిత్రాలు.మిర్చితో బ్లాక్బస్టర్ ఇచ్చాడు, శ్రీమంతుడుతో రికార్డులు తిరగరాసిన అదోరకం బ్లాక్బస్టర్ ఇచ్చాడు.ఇప్పుడు కొరటాల శివ అంటే అగ్ర దర్శకుడు.ట్రేడ్ ప్రపంచంలో కొరటాల అంటే నమ్మకం.అందుకేనేమో బయ్యర్లు ఎగబడి కొనేస్తున్నారు కొరటాల కొత్త చిత్రం జనతా గ్యారేజ్ ని.
సినిమా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు.కాని సిడెడ్ మినహా మిగితా అన్ని ట్రేడ్ ఏరియాల్లో జనతా గ్యారెజ్ బిజినెస్ జరిగిపోయింది.
ఇదంతా ఎన్టీఆర్ క్రేజ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే నాన్నకు ప్రేమతో బిజినెస్ ఇంతవరకు కొన్ని ఏరియాల్లోనే పూర్తయింది.
డిస్ట్రిబ్యూటర్స్ లో కొరటాల మీద ఏర్పడ్డ నమ్మకమే జనతా గ్యారేజ్ బిజినెస్ కి కారణం.అయితే ఏ ఏరియాని ఎంతకు కొన్నారో ఇంకా వివారాలు బయటకి రాలేదు.







