సూపర్‌స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మోత్సవం’.ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సంస్థపై రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్స్.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 8న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.
ముందుగానే విడుదల తేదీని ప్రకటించారు.మహేష్ నిర్మాతలకు ఇప్పుడు అసలు చిక్కు రజనీకాంత్ రూపంలో వచ్చిపడింది.
రజనీకాంత్ ‘కబాలి’(తెలుగులో మహాదేవ్ అనుకుంటున్నారు) సినిమా తెలుగు, తమిళంలో ఓకేసారి విడుదలవుతుందనడంలో సందేహం లేదు.రజనీకాంత్‌తో పోటీ ఎందుకు, సినిమాను రెండు, మూడు వారాలు వెనక్కు తోస్తే ఏం పోయింది అని పివిపి సంస్థ యోచిస్తుందట.
ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ సినిమా తర్వాత విడుదల ప్లాన్‌లో ఉన్న పవన్‌కళ్యాన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, బన్ని ‘సరైనోడు’ వంటి పెద్ద చిత్రాలకు వెనక్కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం మీద రజనీకాంత్ తెలుగు సినిమా స్టార్ హీరోలకు పెద్ద చిక్కు తెచ్చిపెడుతున్నాడు.







