గత కొన్ని రోజులుగా ‘ఈగ’ విలన్ సుదీప్‌తో నిత్యామీనన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.ఇటీవలే తన భార్యకు విడాకులు ఇచ్చిన సుదీప్ తోడు కోసం నిత్యామీనన్ చేయి పట్టుకోబోతున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.
వీరిద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది అంటూ తమిళ మీడియా కోడై కూసింది.ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా నిత్యామీనన్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.
తాజాగా నిత్యామీనన్ మీడియాతో మాట్లాడుతూ.తాను 18 సంవత్సరాల వయస్సులోనే ప్రేమలో పడ్డ.
కాని అప్పుడు అతడితో తనకు సెట్ అవ్వదని భావించి వదిలేశాను.ఆ తర్వాత కూడా పలు సార్లు అలా జరిగింది.
నా జీవితంలో నాకు తోడుగా ఎవరు ఉంటే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందో ఆ వ్యక్తి తన జీవిత భాగస్వామిగా చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.మరి ఆ భాగస్వామి ఎవరు అనేది మాత్రం నిత్యా చెప్పలేదు.
ఈమె వదిలేసిన ఆ ఖాళీని మీడియా వారు సుదీప్ పేరుతో ఫిల్ చేస్తున్నారు.నిత్యా ఆ వార్తలను కొట్టి పారేయని కారణంగా నిత్యా, సుదీప్‌ల ప్రేమ వ్యవహారం నిజమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







