మాజీ ఎంపీ సిరిసిల్ల నిన్నటి వరకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి.కానీ ఇవాళ నిందితుడిగా పోలీసు కష్టదీలో ఉన్నారు.
ఒక్క రోజులోనే ఆయన చరిత్ర తిరగబడింది.కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయిన దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు రాజయ్యను, ఆయన భార్యను, కుమారుడు అనిల్ ను అరెస్టు చేశారు.
శవాలను పోస్టుమార్టం కోసం వరంగల్లోని ఎం జి ఎం ఆసుపత్రికి తరలించారు.రాజయ్యను, కుటుంబ సభ్యులను సుబెదారీ పోలీసు స్టేషన్కు తీసుకుపోయారు.
పోలీసులు నిందితులను ఇంటరాగేషన్ చేయడం ప్రాంభించారు.విచారణ వేగంగా చేస్తారని భావిస్తున్నారు.
రాజయ్య ఎన్నికల గోదాలోకి దిగిన సమయంలోనే ఈ దారుణ ఘటన జరగడంతో ఆయన రాజకేయ జీవితానికి తెర పడింది.నిందితుల మీద చార్జి షీట్లు దాఖలు చేశాక కేసు విచారణ ఎంత కాలం పడుతుందో చెప్పలేము.
అందుకే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి ఉంటారు.







