భారత క్రికేటర్ హర్భజన్ సింగ్ తన వివాహ సన్నాహాల స్పీడ్ పెంచేసాడు.ఇప్పటికే తాజ్ ప్యాలెస్ దాదాపు మొత్తం బుక్ చేసేసిన హర్భజన్ బాలివుడ్ సగాన్ని పెళ్ళికి ఆహ్వానించాడని టాక్.
సినితారాలతో పాటు, క్రికెటర్స్ కి కార్డ్స్ పంచేసిన భజ్జీ ఇప్పుడు రాజకీయనాయకుల మీద పడ్డాడు.
గంట క్రితం ప్రధాని నరేంద్ర మోడిని కలిసిన భజ్జీ వివాహ పత్రికనిచ్చి తన పెళ్ళికి తప్పకుండా రావాలని విన్నవించుకున్నాడు.
ప్రధానమంత్రి మోడీ కుడా దీనికి సానుకూలంగా స్పందించి తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను అని బదులిచ్చారట.మోడితో సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన హర్భజన్ ” ప్రధానమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు, ఆహ్వాన పత్రిక అందుకొని, షెడ్యుల్ సహకరిస్తే తప్పకుండా వివాహానికి హాజరవుతానని మాటిచ్చారు.
ఆయనకున్న క్రికెట్ జ్ఞానం కుడా అధ్బుతం.నా కెరీర్ లో ఏమేం జరిగాయో కుడా ఆయనకీ బాగా గుర్తున్నాయి.
కోరుకున్న అమ్మాయినే పెళ్లాడబోతుండటం ఆనందంగా ఉంది” అంటూ ముగించాడు.ఈ నెల 29న భజ్జీ-గీత బస్రా ల పెళ్లి జలంధర్ లో జరగనుంది.







