చరణ్‌ ఎంత పని చేశాడు!!

రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.రామ్‌ చరణ్‌ నటించి ఈ చిత్రం మొదటి సారి తెలుగు మరియు తమిళంలో ఒకే సారి విడుదల కానుంది.

 Charn Not Attend Bruce Lee 2 Tamil Audio Launch-TeluguStop.com

తమిళంలో భారీగా విడుదల చేసేందుకు డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకున్న నిర్మాత ఏర్పాట్లు చేశాడు.అందుకోసం ఆడియో వేడుకను భారీ స్థాయిలో నిర్వహించాడు.

ఈ ఆడియో వేడుకలో చరణ్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దర్శకుడు శ్రీనువైట్ల ఇంకా పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొంటారు అని నిర్మాత ప్రకటించాడు.

నిన్న జరిగిన ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన చరణ్‌ పాల్గొనలేదు.

హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలు పాల్గొన్నారు.చరణ్‌ వస్తాడని ఆశించిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.

చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు మెగా ఫ్యాన్స్‌ హాజరు అయ్యారు.వారు చరణ్‌ రాకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.

చివరి నిమిషంలో ఫ్లైట్‌ మిస్‌ అయ్యిందని చెప్పి చరణ్‌ కార్యక్రమానికి రాక పోవడంతో తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకున్న నిర్మాత కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు.చరణ్‌ ఎంత పని చేశాడని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్‌ అంటున్నారు.

అయితే ఆడియో విడుదలకు రాకున్నా, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు రోజులు చెన్నై వస్తానంటూ నిర్మాతకు చరణ్‌ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈనెల 16న ఈ చిత్రం అక్కడ, ఇక్కడ విడుదల కానున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube