ఒక సినిమా ఓపెనింగ్స్ లో హీరో ఎంత పాత్ర పోషిస్తాడో … ఒక సినిమా హిట్ అవడంలో డైరెక్టర్ ది అంతే పాత్ర … కాకపొతే డైరెక్టర్ కన్నా హీరో పారితోషికమే ఎక్కువ .ఎందుకంటే డైరెక్టర్ ఎంత మంచి కథ చెప్పాలనుకున్నా, ఆ కథని జనాల్లోకి తీసుకెళ్ళే సత్తా ఉన్న హీరో కావాల్సిందే … కేవలం రాజమౌళి దీనికి మినహాయింపు.
వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ మహేష్ బాబు అభిమానులకి మాంచి మసాల బిర్యాని పెట్టాడు కొరటాల శివ .మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు,పోకిరి, తర్వాత అంతటి విశిష్టత సాధించిన బ్లాక్బస్టర్ శ్రీమంతుడు.డబ్బు పెట్టిన ప్రతీ ఒక్కరికి లాభాలు తెచ్చిపెట్టి, బాహుబలి తర్వాత రెండో అతి పెద్ద హిట్ గా నిలిచింది.ఇంతటి అఖండ విజయాన్ని అందించిన కొరటాల శివ , శ్రీమంతుడు కి తీసుకున్న పారితోషికం ఏంతో తెలుసా ?
సినిమా మొదలవక ముందు 3.5 కోట్ల అగ్రీమెంట్ జరిగింది మైత్రి మూవీ మేకర్స్, కొరటాల మధ్య.సినిమా విడుదలై రికార్డ్స్ ను దత్తత తీసుకున్నాక, కృతజ్ఞతగా మరో 1.5 కోట్లు ఇచ్చారు నిర్మాతలు.మొత్తం 5 కోట్లు .తన కెరీర్ లో మరిచిపోలేని చిత్రాన్ని ఇచ్చినందుకు 50 లక్షల విలువ చేసే ఆడి కార్ ను బాహుమతిగా ఇచ్చాడు సూపర్ స్టార్ .మొత్తం అయిదున్నర కోట్లు .
తదుపరి చిత్రం ఎంత లేదన్న 8-10 కోట్లు మధ్య ఉండొచ్చు కొరటాల పారితోషికం.







