ఒకరేమో బాలివుడ్ బాద్షా .రొమాంటిక్ సినిమాలకి పెట్టింది పేరు .
మరొకరు తెలుగు సినిమా సూపర్ స్టార్ .మకుటం లేని మహారాజు .ఇద్దరి కలిస్తే .అభిమానులకు కన్నుల పండగే .ఇంతకీ ఇద్దరు ఎందుకు, ఎక్కడ కలుసుకున్నారు ?
రామోజీ ఫిలిం సిటిలో ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతోంది, ఫ్యామిలి సాంగ్ చిత్రీకరిస్తున్నారు.ఆ పక్కనే, అదే రామోజీ ఫిలిం సిటీ లో షారుఖ్ దిల్ వాలే షూటింగ్ లో ఉన్నాడు .ఇంకేం ఇద్దరినీ ఒకరిని ఒకరు కలుసుకున్నారు .మహేష్ తో 1-నేనొక్కడినే లో మెరిసిన కృతి సనన్ దిల్ వాలే లో కుడా హీరోయిన్ గా చేస్తోంది.ఒకరితో ఒకరితో చెబుతూ ఇద్దరి మధ్య మాటామంతి కలిపింది ఈ అమ్మడేనంటా .మహేష్ బాబు ఇప్పటికే కలిసాను, మళ్ళి కలవాలనుకుంటున్నాను అని షారుఖ్ పలుమార్లు తన గేమ్ షో లో వెల్లడించాడు.
షారుఖ్ ఇంకో 10 రోజులు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు .మహేష్ కుడా ఆ సాంగ్ పూర్తీ అయ్యేవరకు ఉంటాడు .రోజు ఇక కుబుర్లు పెట్టుకుంటారేమో ఇద్దరు బడా హీరోలు.







