వినాయక చవితికి దాదాపు 15 రోజుల ముందు నుండి వాట్ ఈజ్ రాజుగారి గది అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి కనిపించిన విషయం తెల్సిందే.టాలీవుడ్ ప్రముఖులు ఈ రాజు గారి గది ఏంటి అంటూ చెప్పిన వీడియో బాగా ప్రాచుర్యం పొందింది.
దాంతో అందరి దృష్టి ఈ రాజుగారి గదిపైకి వెళ్లింది.ఎట్టకేలకు వినాయక చవితి రోజు ‘రాజుగారి గది’ అనేది ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఒక హర్రర్ కామెడీ సినిమా అని తేలిపోయింది.
వినాయక చవితి సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే.ట్రైలర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ఓంకార్ ఈ సినిమాను కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
ఈయన మొదటి సినిమా ‘జీనియస్’ 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడం వల్ల యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నష్టాలు రావడంతో ఫ్లాప్ జాబితాలో పడిపోయింది.దాంతో ఈసారి అలా కాకుండా తక్కువ బడ్జెట్‌తో ఓంకార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
పలువురు కమెడియన్స్ ఉన్న ఈ సినిమా భయపెట్టడంతో పాటు, నవ్విస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.







