అన్ని మతాలను ఒకేలా గౌరవించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు.ఆ తక్కువ మంది మంచి వాళ్ళలో మన సల్మాన్ ఖాన్ ఒకడు.
తండ్రి ముస్లీం, తల్లి హిందూ కావడం వల్లనేమో, సల్మాన్ పేరుకి ముస్లీం అయినా ఏనాడు ఒక మత పక్షపాతిగా ప్రవర్తించలేదు.ఒక ముస్లీంలా రంజాన్ మాసాన్ని గడిపే సల్మాన్, అంటే భక్తీ శ్రద్ధలతో దీపావళి, వినాయక చవితి, దసరా కుడా జరుపుకుంటాడు.
మిగితా ఇద్దరు ఖాన్లు ఆమీర్, షారుఖ్ కుడా హిందూ పండగలు జరుపుకున్నా సల్మాన్ భాయి అంత సందడి ఉండదు.
ప్రతి ఏటా వినాయక చవితి తన ఇంట్లో జరుపుకోవడం సల్మాన్ ఖాన్ కు అలవాటు.
తన ఇంట్లోనే విగ్రహం ప్రతిష్టిస్తాడు సల్మాన్.ఈ ఏడాది కుడా ఎప్పటిలానే తన ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నాడు మన భాయిజాన్.
ప్రతి రోజు తన ఇంట్లో పూజలు నిర్వహించి, చుట్టుపక్కల వాళ్లకి ప్రసాదం పంపించడం సల్మాన్ కు అలవాటు.
ఇంతకీ ఇసారి సల్మాన్ ఖాన్ ఇంట్లో గణేశుడు ఎలా ఉండబోతున్నదో చూడాలని ఉందా ?
ఇదిగోండి ….ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా కనిపిస్తున్న ఈ బుజ్జి వినాయకుడే ఈసారి సల్మాన్ ఇంట్లో కొలువుదీరనున్నాడు.







