‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో దర్శకుడు మారుతి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తుంది.
ఇప్పటికే మారుతికి దర్శకుడిగా భారీ పారితోషికమే అందినట్లుగా తెలుస్తోంది.పారితోషికంతో పాటు మారుతి ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను కూడా కొనుగోలు చేయడంతో డబుల్ ప్రాఫిట్ వస్తోంది.
దాదాపు నాలుగు కోట్లు పెట్టి నమ్మకంతో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను మారుతి కొనుగోలు చేయడం జరిగింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా భలే భలే కలెక్షన్స్‌ను రాబడుతున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు దాదాపుగా 6.5 కోట్ల షేర్‌ను ఒక్క ఓవర్సీస్లోనే వసూళ్లు చేసి సంచనం సృష్టించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈసినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథంను పడుతున్నారు.ఓవర్సీస్లో రామ్ చరణ్ గత చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం కంటే కూడా ఎక్కువగా నాని నటించిన ఈ సినిమా వసూళ్లు చేసి అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది.
ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే మారుతి భారీ మొత్తంకు ఓవర్సీస్ రైట్స్ తీసుకుని దాదాపుగా మూడు కోట్ల లాభంను దక్కించుకున్నాడు.మారుతికి ఈ సినిమా ద్వారా దాదాపుగా 5.9 కోట్ల ఆధాయం దక్కినట్లుగా తెలుస్తోంది.