నేరమే....కాని మార్చలేం

ఇది విచిత్రంగా ఉంది.నేరమే కాని మార్చలేమంటున్నారు.ఏమిటిది? ‘మారిపోని కథలే లేవని గమనించుకో’ అన్నాడు సినిమా కవి చంద్రబోస్‌ ఓ సినిమా పాటలో.అయితే కొన్ని కథలు మారవు.అంతే….! అలాంటివాటిలో ఇస్లాం మతంలోని విడాకుల ప్రక్రియ.

 Triple Talaq System A Crime, But No Scope Of Change-TeluguStop.com

ఇస్లాం సంప్రదాయం సంప్రదాయం ప్రకారం భర్త భార్యను ఉద్దేశించి ‘తలాక్‌…తలాక్‌…తలాక్‌’ అని మూడుసార్లు అంటే విడాకులు అయినట్లే లెక్క.దీన్నే ‘ట్రిపుల్‌ తలాక్’ అంటారు.ఈ విధానం ఖరాన్‌, హదిత్‌ న్రకారం చూస్తే నేరం.కాని దాన్ని మార్చడం సాధ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది.

బోర్డు అధికార ప్రతినిధి మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ట్రిపుల్‌ తలాఖ్‌ నేరమని చెప్పారు.కొన్ని ముస్లిం గ్రూపులు తలాఖ్‌ అని ఒక్కసారి చెబితే చాలంటున్నాయని, కాని మార్చలేమని అన్నారు.

ఈ విధానాన్ని మళ్లీ పరిశీలించడానికి కూడా అవకాశం లేదన్నారు.గత నెలలో ఒక మహిళా హక్కుల సంస్థ ట్రిపుల్‌ తలాఖ్‌ విధానంపై, ‘పాలిగామి’ (ఏక కాలంలో ఒక పురుషుడు అనేకమంది భార్యలను కలిగి ఉండటం, ఒక మహిళ అనేకమంది భర్తలను కలిగి ఉండటం) మీద సర్వే చేసింది.

ఈ సర్వేలో తొంభై శాతం మంది మహిళలు ట్రిపుల్‌ తలాఖ్‌, పాలిగామీ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.భారత్‌లో ఈ రెండు పద్ధతులను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.

ప్రతి మతంలోనూ కొన్ని సంప్రదాయాలు మారవు.దేశం సాంకేతికపరంగా ఎంతగా అభివృద్ధి చెందినా, ఆధునికంగా ఎంతగా ఎదిగినా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతూనే ఉంటాయి.

ఒకప్పుడు హిందూ మతంలో ‘సతీ సహగమనం’ అనే దురాచారం ఉండేదని సంగతి తెలిసిందే.రాజారామ్మోహన్‌ రాయ్‌ కృషి చేయకపోతే ఆ దురాచారం ఇంకా కొనసాగేదేమో.

వితంతు వివాహాలకు అనుకూలంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కందుకూరి వీరేశలింగం పంతులువంటి వారు ఉద్యమించారు.కాని ఇప్పటికీ వాటి అవశేషాలు మిగిలే ఉన్నాయి.

ఆచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా వెళ్లకూడదనే విశ్వాసం ఉన్నంతవరకూ అభ్యుదయపరమైన మార్పులు రావు.సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.

అయితే కొన్ని మార్పులు ఆలస్యంగా వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube