ఫ్యాన్స్ మధ్య వార్ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాల్లో ఢీ అంటే ఢీ అంటూ కొట్టుకున్న ఫ్యాన్స్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో హ్యాండ్ టు హ్యాండ్ కొట్టుకున్నారు.
మెగా ఫ్యాన్స్ మరియు రెబల్ స్టార్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ ఫైటింగ్‌కు ప్రత్యక్ష సాక్షులు పోలీసులే.ప్లెక్సీల వివాదంగా మొదలైన ఈ గొడవ పెరిగి పెద్దదై పోలీసులకు ముచ్చెమటలు పట్టేలా చేసింది.
భీమవరంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ భారీ స్థాయిలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.అయితే అర్థరాత్రి సమయంలో ఆ ప్లెక్సీలను కొందరు దుండగులు చించి, కాల్చి వేశారు.
దాంతో ఆగ్రహంకు లోనైన పవన్ ఫ్యాన్స్ ప్రభాస్ పోస్టర్‌లను చించేశారు.అప్పుడు రంగంలోకి దిగిన ప్రభాస్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌పై దాడికి దిగారు.
ఇరు వర్గాల మధ్య తీవ్రమైన త్రోపులాటలు మరియు వాగ్యుద్దాలు కూడా జరిగాయి.దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు.
గొడవకు కారణం మీరంటే మీరే అంటూ మెగా మరియు పవర్ స్టార్ ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పవన్ ఫ్యాన్స్ కట్టిన ప్లెక్సీలను చించింది ఎవరో అనే విషయాన్ని కనిపెట్టేందుకు విచారణ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై పవన్ కాని, ప్రభాస్ కాని ఇప్పటి వరకు స్పందించలేదు.







