‘సర్దార్‌’తో జాయిన్‌ అయిన కాజల్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ‘గబ్బర్‌ సింగ్‌ 2’ / ‘సర్దార్‌’ సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయిన విషయం తెల్సిందే.ఇటీవలే రెండవ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Pawan Kalyan To Romance With Kajal In Sardar-TeluguStop.com

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట విశాఖపట్నం అమ్మాయి అనీష ఆంబ్రోస్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.ఏవో కారణాల వల్ల ఆమెను ఈ సినిమా నుండి తప్పించారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాజల్‌ ఎంపిక విషయంపై చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా కూడా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌ ఆమె అంటూ తెలుస్తోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం కొన్ని రోజుల క్రితం ‘సర్దార్‌’ సెట్‌కు కాజల్‌ వచ్చిందని, దర్శకుడు బాబీ మరియు నిర్మాత శరత్‌ మారార్‌ ఆమెతో కొంత సమయం మాట్లాడారు అంటున్నారు.ఆ తర్వాత ఆమెతో పవన్‌ కూడా మాట్లాడాడు అంటున్నారు.

దాంతో ఈ సినిమాకు కాజల్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యిందని అంతా అనుకుంటున్నారు.అతి త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube