ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా కూడా ‘బ్రదర్స్’ రీమేక్ గురించిన చర్చ జరుగుతోంది.హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘వారియర్’ సినిమాకు బాలీవుడ్‌లో ‘బ్రదర్స్’ టైటిల్‌తో రీమేక్ అయ్యింది.
ఈనెల 14న ‘బ్రదర్స్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.అక్షయ్ కుమార్ మరియు సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించిన ఈ సినిమాపై బాలీవుడ్ జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో రానా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
భారీ అంచనాలున్న ‘బ్రదర్స్’ రీమేక్ రైట్స్‌ను రానా దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ రీమేక్‌లో రానా తనతో పాటు ప్రభాస్ మరియు రామ్ చరణ్‌లను కూడా నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ప్రభాస్‌తో తనకు ఉన్న స్నేహంతో రానా ఈ రీమేక్ గురించి చెప్పడం జరిగింది.
అలాగే చరణ్‌తో కూడా రానాకు మంచి స్నేహం ఉంది.దాంతో రానా మాటను చరణ్ తప్పుకోలేడని అంటున్నారు.
అందుకే చరణ్, ప్రభాస్, రానాల కాంబినేషన్‌లో ‘బ్రదర్స్’ రావడం ఖాయం అని అంటున్నారు.బాలీవుడ్‌లో ‘బ్రదర్స్’ సక్సెస్ అయితే వచ్చే సంవత్సరంలో తెలుగు రీమేక్ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.







