ఆంధ్రాలో ప్రతిపక్షాలది ఒకే నినాదం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలన్నీ ఒకే నినాదం ఎత్తుకున్నాయి.ఒకే డిమాండ్‌ వినిపిస్తున్నాయి.

అదే.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.దీన్ని సాధించడానికి అపోజిషన్‌ పార్టీలు ఉద్యమ బాట పడుతున్నాయి.

వివిధ ఆందోళన కార్యక్రమాలకు రూపల్పన చేస్తున్నాయి.ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా కూర్చున్న అధికార టీడీపీ, దాని మిత్రపక్షమైన భాజపా బండారం బయటపెట్టడానికి సిద్ధమవుతున్నాయి.

ఉద్యమించనిదే ప్రత్యేక హోదా రాదని నిర్ధారించుకున్నాయి.ఇతర సమస్యలు చాలా ఉన్నప్పటికీ స్పెషల్‌ స్టేటస్‌ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాయి.

Advertisement

ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, వైకాపా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఉద్యమ కార్యారణ రూపొందించాలని కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని ఆదేశించారు.

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు.అందుకు ఈ నెల పదో తేదీన ముహూర్తం పెట్టుకున్నారు.

ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తామని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు.స్పెషల్‌ స్టేటస్‌ డిమాండ్‌ చేస్తూ ఈ నెల (ఆగస్టు) పదకొండో తేదీన రాష్ర్ట వ్యాప్త బంద్‌ నిర్వహించబోతున్నట్లు సీపీఐ ప్రకటించింది.

ఈ నెల పదకొండో తేదీలోగా ప్రత్యేక హోదా ప్రకటించకపోతే బంద్‌ జరిపి తీరుతామని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

కేంద్రంలో పదవులు కావాలో, ప్రజా సంక్షేమానికి పాటుపడాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలన్నారు.ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలకు ఆందోళనగానే ఉన్నా పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

అదిగో వస్తుంది.ఇదిగో వస్తుందని నమ్మిస్తున్నారు.

తాజా వార్తలు