నరేంద్ర మోదీ సర్కారుకు దాని మిత్రపక్షమైన శివసేన పెద్ద తలనొప్పిగా మారింది.అది వివిధ అంశాలపై ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వంపైనే తిరగబడుతోంది.
భాజపాకు మిత్రపక్షమైన టీడీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నా నోరు మూసుకొని గమ్మున ఉండిపోగా శివసేన మాత్రం ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేస్తోంది.భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శివసేన దానిపై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి కూడా హాజరైంది.
మహారాష్ర్టలోని మరాఠ్వాడా ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పన్నెండు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలంటున్న కాంగ్రెసు, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్‌సీపీ) డిమాండ్‌ను శివసేన పూర్తిగా సమర్ధించింది.ఆ రెండు పార్టీలతో కలిసి ప్యాకేజీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
మరాఠ్వాడా ప్రాంతం కరువుతో విలవిలలాడుతుండగా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన చేయకపోవడం, ప్యాకేజీ ఇవ్వకపోవడంపై శివసేన విమర్శలు చేసింది.ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం తొమ్మిది వందల కోట్లు కేటాయించిందని, ఇది ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని ప్రతిపక్ష నేత ఒకరు విమర్శించారు.
పన్నెండు వందల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.దీన్ని శివసేన సమర్ధించింది.
ప్యాకేజీ కోసం ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పుడు శివసేన నోరు మూసుకొని ఉంటే మహారాష్ర్టలో దాని పరువు పోతుంది.మహారాష్ర్ట ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేది తానేనని ప్రచారం చేసుకుంటున్న శివసేన ప్రభుత్వాన్ని సమర్ధించి ప్రజలకు కంటు కాలేదు.
అవసరమైతే భాజపాతో తగాదాకు కూడా సిద్ధమే.మిత్ర పక్షాన్ని వదులుకోవడానికి కూడా వెనుకాడదు.
ఏపీలో టీడీపీ ఇందుకు భిన్నంగా ఉంది.







