నోటుకు ఓటు కుంభకోణంలో ఐదో నిందితుడిగా అరెస్టయి, ఏసీబీ విచారణతో ఊపిరి ఆడని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఊపిరి పీల్చుకున్నారు.బెయిల్ మంజూరు కావడమే ఆయనకు ఊపిరి ఆడటానికి కారణం.
మంగళవారం ఏసీబీ కోర్టు ఈ పని చేసింది.బెయిల్ కోసం రెండు లక్షల రూపాయల బాండ్ ష్యూరిటీ సమర్పించిన వెంకట వీరయ్య తన పాస్‌పోర్టు కూడా కోర్టుకు అప్పగించారు.
ఈయన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజవకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు హైకోర్టు విధించిన షరతే ఏసీబీ కోర్టు వెంకటవీరయ్యకు విధించింది.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తుపల్లి దాటి బయటకు రాకూడదని ఆంక్ష విధించింది.జూలై ఆరో తేదీన సండ్ర అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఇంకా ఎవరెవరిని అరెస్టు చేస్తారో ఇంకా తెలియదు.అయితే సండ్రను విచారించినప్పుడు జనార్థన్ అనే పేరు వినబడింది.
అతని సమాచారం సేకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.అతని అరెస్టు చేస్తారేమో….! ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి విచారణ కోసం మరోసారి ఏసీబీ కోర్టుకు వెళ్లాల్సి ఉంది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే సంగతి ఇంకా తెలియలేదు.
ఆ హడావిడి సద్దుమణిగినట్లుగా కనబడుతోంది.దానిపై టీఆర్‌ఎస్-టీడీపీ నాయకుల మధ్య వాదోపవాదాలు కూడా జరగడంలేదు.







