పండుగ ముందే ‘కంచె’

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ రెండవ సినిమా ‘కంచె’ చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయ్యింది.క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ కొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

 Varun Tej’s Kanche Movie Release Date Confirmed-TeluguStop.com

ఈ సినిమా స్వాతంత్య్రంకు ముందు పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కినట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి ఉంది.

ఇటీవల విడుదలైన ‘కంచె’ మూవీ స్టిల్స్‌ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తాం అంటూ మొదట చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

అయితే దసరాకు పెద్ద హీరో క్యూ ఎక్కువగా ఉండటంతో పోటీ ఎందుకనుకుని ముందే వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.దసరాకు రెండు వారాల ముందుగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయాని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న సమయంలో పూరి దర్శకత్వంలో వరుణ్‌ ‘లోఫర్‌’ సినిమాను చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube