మొదటి సినిమా ‘రేయ్’ కాస్త ఆలస్యం అయినా ఆ తర్వాత నుండి మహా జోరుగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ దూసుకు పోతున్నాడు.ఆర్థిక ఇబ్బందుల వల్ల ‘రేయ్’ ఆలస్యం అయిన విషయం తెల్సిందే.
ఆ సినిమా తర్వాత తెరకెక్కిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా మొదట విడుదల అయ్యింది.ఆ తర్వాత ‘రేయ్’ కూడా వచ్చింది.
మొదటి రెండు సినిమాలతో తానేంటో నిరూపించుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను ‘గబ్బర్‌సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నడు.ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.ఆ సినిమా పూర్తి కాగానే ‘పటాస్’ దర్శకుడు అనీల్ రావిపూడితో సాయిధరమ్ తేజ్ హీరోగా మరో సినిమాను దిల్‌రాజు నిర్మించేందుకు ఇప్పటికే చర్చలు జరిపాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది.అతి త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సాయి ధరమ్‌తేజ్ చేయనున్నాడు.
ఇప్పటికే రెండు సినిమాలు చేతిలో ఉంచుకున్న ఈ మెగా హీరో మరో సినిమాకు కూడా సైన్ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ‘ఓం’ అనే ఒక భారీ సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో సాయిధరమ్ తేజ్ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.
సునీల్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ సాయికి నచ్చిందని వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.ఈ మూడు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి, మెగా ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించనున్నాయి.







