సమంత, సిద్దార్థ్‌లు మాజీ ప్రేమికులు అనే విషయం తెల్సిందే.వీరిద్దరు దాదాపు మూడు సంవత్సరాల పాటు చట్టా పట్టాలేసుకుని తిరిగారు.
కారణాలు ఏంటో తెలియదు కాని, వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అయ్యింది.ప్రేమలో ఉన్న సమయంలో ఒప్పుకున్న సినిమాను సైతం బ్రేకప్ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆ తర్వాత వీరిద్దరికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి అని అంతా అనుకున్నారు.కాని సిద్దార్థ్‌కు తాజాగా సమంత సాయం చేసింది.
ఫ్లాప్‌తో సతమతం అవుతున్న సిద్దార్థ్‌కు ‘అరణ్మని-2’ చిత్రంలో అవకాశం ఇప్పించింది.
‘అరణ్మని’ చిత్ర దర్శకుడు సుందర్.
సి తో సమంతకు మంచి సన్నిహిత సంబంధం ఉంది.ఆ సన్నిహిత్యం వల్లే తన పాత మిత్రుడు అయిన సిద్దార్థకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వాల్సిందిగా సమంత కోరింది.
సమంత కోరికను కాదనలేక సుందర్.సి తన తాజా చిత్రం ‘అరణ్మని-2’లో అవకాశం ఇచ్చాడు.
ఈ సినిమాతో అయినా సిద్దార్థ్ మునుపటి ఫామ్‌కు వస్తాడేమో చూడాలి.ఇక ప్రస్తుతం సమంత తెలుగు మరియు తమిళంలో వరుస సినిమాతో దూసుకు పోతుంది.
తాజాగా సిద్దార్థ్‌కు సమంత మాట సాయం చేయడంతో మళ్లీ వీరిద్దరి మధ్య ఏమైనా వ్యవహారం మొదలు కానుందా అనేది ప్రస్తుతం చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ఉంది.







