‘బాహుబలి’ సినిమాకు దేశ వ్యాప్తంగా ఆధరణ లభిస్తుంది.పలువురు ప్రముఖుల నుండి ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా తెలుగు వారికి గర్వకారణం అంటూ పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖు ప్రశంసిస్తూ వస్తున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బాహుబలి’ సినిమాపై స్పంచారు.
ఈ సినిమా తెలుగు వారికి గర్వ కారణం అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.ఇలాంటి సినిమాను తెరకెక్కించిన రాజమౌళికి శుభాకాంక్షలు, తెలుగు సినిమాను ప్రపంచం ముందుకు తీసుకు వెళ్లినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు ట్వీట్‌కు ‘బాహుబలి’ చిత్ర యూనిట్ స్పందించింది.చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం మీ ప్రశంసలకు కృతజ్ఞతలు చెబుతున్నాం అంటూ ట్వీట్ చేశారు.
జక్కన్న రాజమౌళి కూడా సీఎం ట్వీట్‌కు రీ ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలాంటి సినిమా తీసినందుకు పలువురు సినీ ప్రముఖు సైతం జక్కన్నను అభినందించారు.
ప్రస్తుతం ‘బాహుబలి’ విజయానందంలో చిత్ర యూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా పలు రికార్డును ఈ సినిమా బద్దలు కొడుతూనే ఉంది.







