టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్‌లతో సినిమాలు చేయాలని యువ హీరోలు కలలు కంటూ ఉంటారు.వారితో ఒక సినిమా చేస్తే స్టార్స్ అయ్యే చాన్స్ ఉంటుందనే ఉద్దేశ్యంతో యువ హీరోలు వీరితో సినిమాలు చేయాని కోరుకుంటారు.
ప్రస్తుతం నితిన్‌కు ఈ అవకాశం దక్కింది.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని యువ హీరో నితిన్ దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నితిన్ లేదా నాగచైతన్యతో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
నాగచైతన్యను కాదని ఆ బంపర్ ఆఫర్ నితిన్‌కు వచ్చింది.
తాజాగా నితిన్‌తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఏర్పాట్లు ప్రారంభించాడు.ఇప్పటికే నితిన్‌కు త్రివిక్రమ్ స్టోరీ కూడా నరేట్ చేసినట్లుగా సినీ వర్గా నుండి సమాచారం అందుతోంది.
ఇటీవలే పూరి సినిమా చేసే అవకాశాన్ని కోల్పోవడంతో కాస్త బాద పడ్డ నితిన్ కొన్ని రోజు తిరగకుండానే మాటల మాంత్రికుడు దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తున్నాడు.ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకున్నా, ఇది మాత్రం కన్ఫర్మ్ న్యూస్ అంటూ సినీ జనాలు అంటున్నారు.
అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.ఈ సినిమా నితిన్ కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవ్వడం ఖాయం అని ప్రముఖులు అంటున్నారు.







