కటకటాల వెనక్కి ఎమ్మెల్యే 'సండ్ర'

ఏ కేసులో ఏ నిందితుడు అరెస్టు అయినా, కోర్టుకు హాజరు పర్చడం, వెంటనే పద్నాలుగు రోజుల రిమాండ్‌కు (జ్యుడీషియల్‌ కస్టడీ) తరలించడం మామూలు వ్యవహారమే.నోటుకు ఓటు కేసులో అరెస్టయిన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్యకూ అదే పని జరిగింది.

 14 Days Remand For Mla Sandra-TeluguStop.com

సోమవారం ఏడు గంటలపాటు విచారించి, ఆ వెంటనే అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.దీంతో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

నోటుకు ఓటు కుంభకోణంలో అరెస్టు అయిన నాలుగో వ్యక్తి సండ్ర వెంకటవీరయ్య.రిమాండ్‌ ముగిశాక మళ్లీ తమ కస్టడీకి అప్పగించాలని, ఇంకా విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేయడం, నిందితుడు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేయడం ఇదంతా సాధారణంగా జరిగే వ్యవహారమే.

సండ్రను రిమాండుకు తరలించగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు.దీనిపై ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం’ అని సండ్ర కూడా మీడియాతో చెప్పారు.

స్టీఫెన్‌ తన వాంగ్మూలంలో ఎక్కడా సండ్ర పేరే ప్రస్తావించలేదని టీడీపీ నాయకులు అన్నారు.ఇది దళితుడి మీద దాడి చేయడమేనని ‘కులం రంగు’ కూడా పులిమారు.

రిమాండ్‌ తరువాత సండ్రకు బెయల్‌ దొరుకుతుందా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube