హీరోయిన్ ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మంత్ర`2’ విడుదల కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది.రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా విడుదలకు నోచుకోలేదు.
ఇటీవల ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశాడు.ఛార్మి ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకుంది.
ఆ క్రేజ్‌తో ఈ సినిమాను బిజినెస్ చేయాలని నిర్మాతలు చూసినా అది వర్కౌట్ అవ్వలేదు.ఈ సినిమాను కొనేందుకు ముందుకు రాలేదు ఏ డిస్ట్రిబ్యూటర్.
సొంతంగా విడుదల చేసే స్థాయిలేక మరోసారి ఈ సినిమాను ఆపేశారు.ఇప్పటికే ఈ సినిమా కోసం చేసిన అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న నిర్మాత ఈ సినిమాను సొంతంగా విడుదల చేసే సాహసం చేయడం లేదు.
ఇక డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చడం లేదు.మొత్తంగా ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేక పోవడంతో విడుదల ఇలా వాయిదాల పర్వం కొనసాగుతుందని చెబుతున్నారు.
మరి ‘మంత్ర`2’కు మోక్షం ఎప్పుడో చూడాలి.







