యువ హీరో రానా ‘బాహుబలి’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే.‘బాహుబలి’కి తమ్ముడు పాత్ర భల్లాల దేవ పాత్రలో రానా కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో రానా భయంకరమైన విలన్ పాత్రలో నటించాడని, సినిమాకు భల్లాలదేవ పాత్ర అతి కీలకంగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ పదే పదే చెబుతున్నారు.తాజాగా ఈ సినిమాలో రానా ద్విపాత్రాభినం చేశాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి.
ప్రభాస్ తండ్రి కొడుకులుగా నటిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో రానా కూడా తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరిగింది.
మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో రానా ద్విపాత్రాభినయం చేయడం లేదని, సింగిల్ పాత్రలోనే రానా కనిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు.అయితే రెండు పార్ట్‌లలో కూడా రానా ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
రానాకు కొడుకు పాత్రలో అడవి శేషు నటించాడు.జులై 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.







