టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.ఒక వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతూనే మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నాడు.సినిమాలను ప్రమోట్ చేయడంలో కరణ్ జోహార్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
ఈయన సినిమాలు అంటే హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది.ఇక ‘బాహుబలి’ హిందీ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో వచ్చేలా కరణ్ జోహార్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.
తాజాగా బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీమియర్ షోను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి, బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకిర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.జులై 10న విడుదల కాబోతున్న ‘బాహుబలి’ సినిమా ప్రీమియర్ షోను జులై 9న భారీగా ప్లాన్ చేస్తున్నాడు.
ఈ ప్రీమియర్ షోకు అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు సైతం అందినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు తెలుగు మరియు తమిళంలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.







