సత్యశోధన పరీక్షకు సిద్ధం

సత్యశోధన పరీక్ష అంటే లైడిటెక్టర్‌ టెస్‌్ట అంటారు.దీనికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సునంద పుష్కర్‌ కేసులోని ముగ్గురు సాక్షులు.

 Ready For Lie-detector Test-TeluguStop.com

సునంద పుష్కర్‌ ఎవరో తెలిసేవుంటుంది.యూపీఏలో మంత్రిగా పని చేసిన కాంగ్రెసు నాయకుడు, మాజీ బ్యూరోక్రాట్‌ శశి థరూర్‌ భార్య.

ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.ఈ కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది.

ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) కూడా ఏర్పాటు చేశారు.ఇప్పుడు ఈ కేసులోని ముగ్గురు సాక్షులకు లై డిటెక్టర్‌ పరీక్ష జరపాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.

అయితే నిందితులుగాని, సాక్షులుగాని సహకరిస్తేనే ఈ పరీక్ష జరపడం సాధ్యమవుతుంది.అయితే ముగ్గురు సాక్షులు తాము సహకరిస్తారమని, ఈ పరీక్షను ఎదుర్కొంటామని చెప్పారు.

థరూర్‌ ఇంటి పనిమనిషి నారాయణ్‌ సింగ్‌, డ్రైవర్‌ బజరంగి, కుటుంబ స్నేహితుడు సంజయ్‌ ధావన్‌ సత్యశోధనకు అంగీకరించారు.ఈ ముగ్గురి దగ్గర కీలకమైన సమాచారం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube