అల్లు మూవీ ఫిక్స్‌

‘గౌరవం’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అయిన అల్లు శిరీష్‌ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ‘కొత్త జంట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అప్పటి నుండి కూడా అల్లు శిరీష్‌ తన తర్వాత సినిమాను కన్ఫర్మ్‌ చేసింది లేదు.

 Allu Sirish Movie Confirmed With Parasuram-TeluguStop.com

‘కొత్త జంట’ విడుదల కాగానే పవన్‌ సాదినేనితో ఒక సినిమా చేయబోతున్నట్లుగా అల్లు శిరీష్‌ స్వయంగా ప్రకటించాడు.అయితే స్క్రిప్ట్‌లో అల్లు శిరీష్‌ సూచించిన మార్పులకు పవన్‌ ఒప్పుకోక పోవడంతో మొత్తానికి సినిమా ప్రాజెక్ట్‌ అటకెక్కింది.

ఆ తర్వాత పలు కథలు విన్న శిరీష్‌కు ఏ ఒక్కటి పెద్దగా నచ్చింది లేదు.చిరకు ‘సోలో’ ఫేం పరశురామ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పాడు.

పరశురామ్‌ సినిమాకు అల్లు శిరీష్‌ ఓకే చెప్పి దాదాపుగా ఆరు నెలలు అవుతోంది.అది కూడా ఇప్పటి వరకు సెట్స్‌ పైకి వెళ్లింది లేదు.

స్క్రిప్ట్‌లో పదే పదే మార్పులు చేర్పులు చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందట.

వచ్చే నెలలో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా అల్లు శిరీష్‌ స్వయంగా ప్రకటించాడు.ఈ సినిమాలో అల్లు శిరీష్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడు.

ఇక ‘సూర్య వర్సెస్‌ సూర్య’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన త్రిధా చౌదరి ఈ మెగా మూవీలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.జూన్‌లో ప్రారంభం అయ్యే ఈ సినిమా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

గీతా ఆర్ట్స్‌బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube