నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లయన్’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.బాలయ్య 98వ సినిమాగా ‘లయన్’ తెరకెక్కిన విషయం తెల్సిందే.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 99వ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.‘లయన్’ విడుదలకు ముందే తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని భావించారు.
కాని స్క్రిప్ట్‌లో కొంత మార్పులు చేర్పుల వల్ల ఆలస్యం అయ్యింది.
బాలకృష్ణ 99వ సినిమాను ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఈ సినిమాను శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నాడు.తాజాగా ఈ సినిమా ప్రారంభ డేట్‌ను దర్శకుడు శ్రీవాస్ అధికారికంగా ప్రకటించాడు.
మే 29న ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
అంజలి హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రానికి ముందు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.







