ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చాడో....?

మనం ఏదైనా ఓ పని చేస్తే కాయా? పండా? అని అడుగుతారు కొంతమంది.ఇదే ప్రశ్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, టీడీపీలో తండ్రి తరువాత చురుగ్గా పనిచేస్తున్న లోకేష్‌ను కూడా అడగాలి మరి.

 Nara Lokesh Returns After Successful Us Tour-TeluguStop.com

పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన లోకేష్‌ తిరిగి వచ్చారు.అక్కడ ఆయన ఏఏ ఒప్పందాలు చేసుకున్నారో, ఎన్ని కోట్ల పెట్టుబడులతో తిరిగొచ్చారో ప్రజలకు వివరించాలి.

ఆయన వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లలేదు.ప్రభుత్వం తరపునే వెళ్లాడని అధికారులు చెప్పారు.

ఆయన వెంట ఐఏఎస్‌ అధికారులు కూడా వెళ్లారు.ఇది ప్రభుత్వం తరపున చేసిన పర్యటన కాబట్టి దాని ఫలితాలు వివరించాల్సిన బాధ్యత చిన బాబుకు ఉంది.అందులోనూ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కూడా కలుసుకున్నారు.‘స్మార్‌్ట విలేజ్‌-స్మార్‌్ట వార్‌్డ’ అనే కార్యక్రమం కింద ఏపీలోని పల్లెటూళ్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన ఎన్‌ఆర్‌ఐలను కోరారు.మరి ఎవరెవరు ముందుకు వచ్చారో…! తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.ఆయన కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇద్దరు సీఎంల కుమారులు దాదాపు ఒకేసారి అమెరికా వెళ్లారు.మరి ఇద్దరిలో ఎవరు ఎక్కువ విజయం సాధించి ఉంటారు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube