తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కిసాన్ యాత్ర’ (పాదయాత్ర) ప్రారంభమైంది.జిల్లాలోని నిర్మల్‌లో యువరాజు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు.
ఆయన యాత్ర ఉద్దేశం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడమేకాకుండా వారికి ఆర్థిక సాయం అదించడం కూడా.మొట్టమొదటగా ఆయన రాజేశ్వర్ అనే రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం (చెక్కు ఇచ్చారు) అందచేశారు.
ఇంకొన్ని కుటుంబాలకూ చేస్తారేమో.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు పరామర్శిచలేదని, ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న కాంగ్రెసు నాయకులు తమ నాయకుడి చేత ఆ పని చేయించారు.
రాహుల్ యాత్ర పైకి రైతు కుటుంబాలను పరామర్శించే యాత్రేగాని అసలు ఉద్దేశం కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడం.అది మరింత బలహీనపడకుండా చూసుకోవడం.
గ్రామీణ ప్రాంతాల్లో, రైతుల్లో ఇమేజీ పెంచుకోవడం.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయానికి బాటలు వేసుకునేందుకు ఈ యాత్ర ఓ పునాదిలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
తెలంగాణలో రాహుల్ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.







