మోహన్‌బాబు నట వారసురాలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంచు లక్ష్మి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా సందడి చేసిన మంచు లక్ష్మి తాజాగా ‘దొంగాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాతో కొత్త మంచు లక్ష్మి కనిపిస్తోంది.ఇప్పటి వరకు మామూలు నటిగా కనిపించన మంచు లక్ష్మి ఈ సినిమాలో మాత్రం ఒక డ్యాన్సర్‌గా, మంచి కమెడియన్‌గా, మంచి సింగర్‌గా, సెంటిమెంట్ సీన్స్‌లో మంచి నటన కనబర్చి కొత్తగా కనిపించింది.
‘దొంగాట’ సినిమాలో మంచులక్ష్మి తెలుగు స్టార్ యాక్షన్ హీరోయిన్‌గా కనిపించింది.ఈమె కనబర్చిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేదిగా ఉంది.
ఇక సెకండ్ హాఫ్‌లోని ఆమె చూనిన ఎమోషన్స్ కూడా ఈమెను నటిగా మరో మెట్టు ఎక్కించింది.ఇప్పటికే ఈమెకు మంచి పేరు ఉంది.
తాజాగా ఈ సినిమాతో నిర్మాతగా, నటిగా మరింత క్రేజ్‌ను దక్కించుకుంది.మంచు లక్ష్మి తెరకెక్కించిన మొదటి సినిమా కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడంతో సంతోషంగా మునిగి తేలుతోంది.
ఇప్పటికే ‘దొంగాట’కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.వసూళ్లు కూడా ఊహించిన దానికంటే కూడా అధికంగా వస్తున్నాయి.
మొత్తానికి ‘దొంగాట’ సినిమా మంచు లక్షి కెరీర్‌లో మైలు రాయి సినిమాగా నిలిచి పోనుంది.







