ఓ కార్యకర్త నాయకుడిని నిలదీశాడు.నాయకుడు రాజకీయాల్లో, పార్టీలో తలపండిన వ్యక్తి.
ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా.ఆ కార్యకర్త సినిమా నటుడిగా సుపరిచితుడు.
కాని ఆ పార్టీలో కొత్తవాడు.ఆ నాయకుడు, కార్యకర్త ఎవరునుకుంటున్నారు? నాయకుడు భాజపాలో జగమెరిగిన లీడర్, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆ కార్యకర్త సినిమా నటుడు శివాజీ.కొత్తగా భాజపాలో చేరాడు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగానే నాలుగో రోజున బలవంతంగా ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక హోదాపై ‘మాటలు’ చెబుతున్న వెంకయ్య నాయుడికి శివాజీ పది ప్రశ్నలు సంధించాడు.వెంకయ్య నాయుడు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడనుకోండి.అది వేరే విషయం.కాని ప్రజల పట్ల బాధ్యతగల నాయకుడిగా వెంకయ్య నాయుడు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి.
ఇది నైతికతకు సంబంధించిన విషపయం కాబట్టి ఆయన విచక్షణ ప్రకారం చేయొచ్చు.శివాజీ సంధించిన ప్రశ్నలు ఆసక్తికరంగానే ఉన్నాయి.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రయత్నిస్తున్న మీరు ఆ నెపాన్ని ఫైనాన్షియల్ కమిటీ మీదికి తోయడంలేదా? ప్రధాని తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ప్రత్యేక ఇవ్వొచ్చు.కాని ఇందుకు మీరు సాకులు చెప్పడంలేదా? ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటూ మీరు అబద్ధాలు చెప్పడం లేదా? మీరు కేంద్ర మంత్రి అయ్యాక ప్రత్యేక హోదా విషయమై ఐదు నిమిషాలైనా ఆలోచించడంలేదన్న విషయంలో వాస్తవం ఉందా? మా పోరాటాన్ని ప్రచారం అంటున్నారు.మరి మరు విశాలాంధ్ర కోసం చేసిన పోరాటం కూడా ప్రచారమేనా? మీరు జై ఆంధ్రా ఉద్యమంలో జైలుకెళ్లారు.అదీ ప్రచారమేనా? అసలు ఏపీని అభివద్ధి చేయాలనే కోరిక భాజపాకు ఉందా? మీరు ఏపీ తరపున ఎందుకు మాట్లాడటంలేదు? …ఇలా మరో రెండు ప్రశ్నలు అడిగాడు శివాజీ.వాస్తవానికి ఈ ప్రశ్నలనీ పవన్ కళ్యాణ్ అడగాలి.ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగితే తాను ప్రభుత్వాలను ప్రశ్నిస్తానన్నాడు.కాని చిన్న హీరో శివాజీ ప్రశ్నించాడు.ఎవరైతే ఏముంది నిగ్గదీసి అడగడానికి?
.






