‘కొచ్చడయాన్’, ‘లింగ’ మూవీలు డిజాస్టర్‌లుగా నిలవడంతో రజినీకాంత్ తన తర్వాత సినిమాపై మరింత శ్రద్ద పెడుతున్నాడు.‘లింగ’ సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మరో సినిమాను ఈయన ప్రారంభించింది లేదు.
ఇప్పటికే పలువురి దర్శకుల దర్శకత్వంలో రజినీ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే వాటికి వేటికి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వచ్చింది లేదు.
రజినీతో మురగదాస్ ఒక భారీ సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో మరోసారి రజినీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.
‘శివాజీ’, ‘రోబో’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అనగానే అందరి అంచనాలు పెరుగుతున్నాయి.వీరిద్దరు ముంబైలో కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్‌కు సుందర్ సి ఒక కథను వినిపించాడని, ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు సిద్దం అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాలను సాధించడంతో రజినీ ఆయనకు ఓకే చెప్పాడు.
అయితే ఈ వార్తలో కూడా క్లారిటీ లేదు.రజినీ నోరు తెరిచి తాను పలాన సినిమాలో నటిస్తున్నాను అని ప్రకటించే వరకు క్లారిటీ రాదు.







