ఎన్టీఆర్‌ ‘కత్తి’ నిర్ణయంపై తెదేపా ఫైర్‌

తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కత్తి’ సినిమాను తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించనున్నాడని, ఠాగూర్‌ మధు నిర్మించనున్నాడని కూడా మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఎన్టీఆర్‌ ‘కత్తి’ రీమేక్‌కు ఒప్పుకున్నందుకు తెలుగు దేశం పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.

 Tdp Leaders Angry On Ntr-TeluguStop.com

ఏపీలో ప్రభుత్వంను నడుపుతున్న తెదేపాకు ‘కత్తి’ రీమేక్‌ సినిమా వ్యతిరేకం అయ్యే అవకాశాలున్నాయి.అందుకే ముందు జాగ్రత్తగా తెదేపా వర్గాల వారు ఎన్టీఆర్‌ను ఆ రీమేక్‌ చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వానికి, ‘కత్తి’ రీమేక్‌కు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ‘కత్తి’ సినిమాలో హీరో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాడు.ప్రభుత్వం సెజ్‌ల కోసం అంటూ పేద రైతుల నుండి భూమి లాక్కుని, వారిని రోడ్డున పడేస్తుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

రోడ్డున పడ్డ రైతులకు మద్దతుగా ‘కత్తి’ సినిమాలో విజయ్‌ నటించాడు.ఇప్పుడు తెలుగులో ఆ సినిమా రీమేక్‌ చేస్తే రైతులకు మద్దతుగా ఎన్టీఆర్‌ ఆందోళనలు చేస్తున్నాడు అనే టాక్‌ వెళ్తుంది.

రాజధాని కోసం భూములను రైతుల నుండి లాక్కోవడం జరిగింది.ఈ నేపథ్యంలో ‘కత్తి’ రీమేక్‌ వస్తే రైతులకు ప్రభుత్వంపై మరింతగా కోపం రావడం ఖాయం అని అంటున్నారు.

అందుకే ఎన్టీఆర్‌పై తెదేపా నేతలు ఫైర్‌ అవుతున్నారు.అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ‘కత్తి’ సినిమా రీమేక్‌ విషయంలో అధికారిక ప్రకటన వచ్చింది లేదు.

ఒక వేళ అధికారిక ప్రకటన వస్తే తెదేపా నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube