బోయపాటికి మళ్లీ షాక్‌?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా దర్శకుడి బోయపాటి శ్రీను పరిస్థితి ఉంది.

ఈయన ‘లెజెండ్‌’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను కొట్టిన విషయం తెల్సిందే.

బాలయ్య కెరీర్‌లోనే భారీ హిట్‌ను బోయపాటి శ్రీను అందించాడు.ఇంతటి భారీ సక్సెస్‌ అందుకున్న ఏ దర్శకుడు అయినా ఈపాటికి తన తర్వాత సినిమాను మొదలు పెట్టి, విడుదల కూడా చేసేవాడు.

కాని బోయపాటి శ్రీను అదృష్టం బాగాలేదో ఏమో కాని, ఈయన ‘లెజెండ్‌’ తర్వాత ఇప్పటి వరకు తన తర్వాత సినిమాను ప్రారంభించలేదు.‘లెజెండ్‌’ విడుదల కాగానే మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో బోయపాటి సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.ఆ తర్వాత ‘అల్లుడు శీను’ ఫేం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమా ప్రారంభించాడు.

Advertisement

ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.అయితే నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాకుండానే అటకెక్కింది.

ఇక ఆ మధ్య ఈయన మెగా హీరో అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమాను అల్లు అరవింద్‌ నిర్మించనున్నాడని ప్రచారం జరిగింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా క్యాన్సిల్‌ అయ్యిందని అంటున్నారు.ఇందులో ఎంత నిజం ఉంది అనేది త్వరలో తేలిపోనుంది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు