‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతుంది.త్వరలో ఈమె నటించిన రామ్ ‘పండుగ చేస్కో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమాతో పాటు రామ్‌చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.రవితేజతో ఒక సినిమాలో నటిస్తోంది.
ఆ మధ్య ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా ఈమె ఎంపిక అయ్యింది.అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి.
గత వారం రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను రకుల్ తొసిపుచ్చింది.తాను ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్‌తో నటించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని, సుకుమార్ దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొంది.దాంతో కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఈమె ప్రకటన ఫుల్ స్టాప్ పెట్టింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటించబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడా ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.







