ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైకాపా నేత రోజా పై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు .ఆమె అసలు సభ్యత అనేది మచ్చుకైన కనబరచకుండా సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు .
ఆమె నోరు విప్పితే బండ బూతులు మాట్లాడడమే పెట్టుకున్నారు.కనుక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము .రోజా,కొడాలి నాని వంటి నేతలు ఐరన్ లెగ్గులు వారు ఏపార్టీ ఉంటె సర్వనాశనం.రోజా అంటి పై సభ చర్య చేపట్టాలి అని కోరుతున్నాను అని బొండా తెలిపారు.
దీనిపై రోజా మీడియా పాయింటులో స్పందించారు .బొండా ఏమైనా 16ఏళ్ళ పిల్లాడా?నేను ఆంటీ కావడానికి అని గుస్సా అయ్యారు.







