పూర్ణ ఫుల్‌గా తృప్తి చెందిందట

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఎక్కడైనా కూడా మహేష్‌బాబుకు ఫ్యాన్స్‌ ఉంటూనే ఉంటారు.అన్ని వుడ్స్‌ల హీరోయిన్స్‌ సైతం మహేష్‌బాబుతో ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటూ ఉంటారు.

 Poorna Happy With Item Song In Mahesh Movie-TeluguStop.com

ఎంతో మంది హీరోయిన్స్‌ కోరుకుంటే, అందులో కొంత మందికి మాత్రమే మహేష్‌బాబుతో నటించే అవకాశం దక్కుతుంది.అలా దక్కిన వారిలో పూర్ణ ఒకరు.

ఈ అమ్మడు మహేష్‌బాబుతో సినిమా చేయాలని ఎంతో కాలంగా కలలు కంటూ ఉందట.ఆ కల ఇప్పటికి తీరిందని సంతోషంతో ఊగి పోతూ చెబుతోంది.

తాను ఆశించినట్లుగా మహేష్‌బాబుతో కలిసి నటించాను అనే సంతోషం జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ ఈ అమ్మడు ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

మహేష్‌బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ సినిమాలో ఒక ఐటెం సాంగ్‌ను పూర్ణ చేసింది.

చిన్న ఐటెం సాంగ్‌ చేసినందుకే పూర్ణ ఫుల్‌ హ్యాపీ ఫీల్‌ అవుతూ ఉంది.తాజాగా మహేష్‌బాబుతో ఐటెం సాంగ్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది పూర్ణ.

ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు కృతజ్ఞతలు చెబుతోంది.ఇటీవలే రాజుసుందరం మాస్టారు ఆధ్వర్యంలో మహేష్‌బాబు, పూర్ణలు ఐటెం సాంగ్‌లో డ్యాన్స్‌ వేశారు.

ఈ సినిమా మే మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

మహేష్‌బాబు గత చిత్రం ‘ఆగడు’లో శృతిహాసన్‌ ఐటెం సాంగ్‌ను చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube