అఖిల్‌కు ‘జిల్‌’మనిపించనుంది!

‘ఊహలు గుసగుసలాడే’, ‘జోరు’ సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా.ఈ అమ్మడు త్వరలో గోపీచంద్‌ హీరోగా నటించిన ‘జిల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 Raashi Khanna’s Item Song In Akhil Movie..?-TeluguStop.com

‘జిల్‌’ ఆడియో వేడుకలో రాశిఖన్నాపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రభాస్‌ తన తర్వాత సినిమాలో ఈ అమ్మడిని హీరోయిన్‌గా బుక్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.తాజాగా ఈ అమ్మడికి మరో బంపర్‌ ఆఫర్‌ దక్కింది.

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ ఎంట్రీ ఇస్తున్న మూవీలో ఈ అమ్మడితో ఐటెం సాంగ్‌ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

వివి వినాయక్‌ దర్శకత్వంలో యువ హీరో నితిన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సయేషా సైగల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.

ఇక ఈ సినిమాలో ఒక మాస్‌ మసాలా ఐటెం సాంగ్‌ను పెట్టాలని వినాయక్‌ భావిస్తున్నాడు.అందుకోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకోవడం జరిగింది.

ఐటెం సాంగ్స్‌ విషయంలో తాను వెనక్కు తగ్గను అని, అలాగే అందాల ఆరబోతలో కూడా ఏమాత్రం వెనుకంజ వేయను అంటూ ఈఅమ్మడు తాజాగా ఓపెన్‌గా ప్రకటించింది.దాంతో వెంటనే రాశి ఖన్నా అందాలను తమ సినిమాలో ఐటెం రూపంలో చూపించాలని వినాయక్‌ నిర్ణయించుకున్నాడు.

ఇప్పటికే రాశి ఖన్నాతో ఐటెం విషయంలో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.అఖిల్‌ సినిమాలో ఐటెంగా చేసి రాశి జిల్‌మనిపించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube