మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమా దాదాపు రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 27న విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా లేట్ అవ్వడంతో కాస్త బిజినెస్ పరంగా వెనుక పడిపోయినట్లుగా తెలుస్తోంది.
అయినా కూడా దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఈ సినిమాపై పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నాడు.సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టంకు ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ‘రేయ్’కు గట్టి పోటీని ఇచ్చేందుకు గోపీచంద్ ‘జిల్’ మూవీ రంగంలోకి దిగుతోంది.
‘లౌక్యం’ సినిమాతో సక్సెస్ కొట్టి జోరుమీదున్న గోపీచంద్ తాజాగా ‘జిల్’ సినిమాతో రెడీ అయ్యాడు.
ఇటీవలే ఆడియో విడుదల అయిన ఆ సినిమాను మార్చి 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రకటించారు.‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ సినిమాలతో సక్సెస్‌లను అందుకున్న ఈ నిర్మాతలు అనుకున్న సమయానికి ‘జిల్’ మూవీని భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
మరే ఇతర సినిమా పోటీగా ఉన్నా కూడా తగ్గేది లేదు అంటూ దూకుడుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మరో వైపు ‘రేయ్’ సినిమాను కూడా వాయిదా వేసే అవకాశాలు లేవు.
దాంతో ఈ రెండు సినిమాలు మార్చి 27న ఢీ కొట్టాల్సిందే.మరి ఈ పోటీలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.







