గత వారం రోజులుగా మీడియాలో రాధిక ఆప్టే న్యూడ్ వార్తలు జోరుగా వస్తున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు న్యూడ్ సీన్స్‌లో నటించేందుకు ఓకే చెప్పిందని, త్వరలో ఒక ఇంగ్లీష్ సినిమా కోసం న్యూడ్‌గా నటించబోతుందనే వార్తలు తమిళ, తెలుగుతో పాటు ఇతర భాష మీడియాలో చివరకు నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలపై తాజాగా రాధిక ఆప్టే స్పందించింది.తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వారు వక్రీకరించారు అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.
ఇంగ్లాండ్‌లో ఒక మీడియా సంస్థకు ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా ఈ టాపిక్ మొదలైంది.సదరు విలేకరి ఇండియాలో హీరోయిన్స్ ఎందుకు న్యూడ్‌గా నటించేందుకు ఓకే చెప్పరు, అలాగే హాట్‌గా నటిచేందుకు కూడా కొందరు ఆసక్తి చూపని కారణం ఏంటని ఈమెను ప్రశ్నించారట.
అందుకు సమాధానంగా ఈమె మాట్లాడుతూ.అందరి గురించి ఏమో కాని తాను మాత్రం కథానుసారం గ్లామర్ పాత్రల్లో నటించేందుకు సిద్దం అని, అలాగే కథలో తప్పని సరి అయితే తప్పకుండా న్యూడ్ సీన్స్ కూడా చేస్తాను అని చెప్పిందట.
అంతే తప్ప న్యూడ్ సీన్స్‌లో తనకు నటించాలనే ఉద్దేశ్యం లేదని ఈ అమ్మడు చెబుతోంది.







