మెగా హీరోలకు సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఆ వేడుకలో పాల్గొన్న మెగా ఫ్యాన్స్ పవన్ నామ జపం చేయడం ఖాయం.తాజాగా జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో ఫంక్షన్‌లో కూడా ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్‌స్టార్ అంటూ పెద్ద ఎత్తున ఆరుపులు కేకలు వేయడం చేశారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులు మాట్లాడుతున్న సమయంలో కూడా పవర్‌స్టార్ అంటూ గట్టిగా మొత్తుకున్నారు.అయినా అల్లు అరవింద్, బన్నీ, త్రివిక్రమ్‌లు ఆ అరుపులు పట్టించుకోకుండా తాము మాట్లాడాలి అనుకున్నది మాట్లాడేశారు.
అయితే దాసరికి మాత్రం పవన్ ఫ్యాన్స్ అరుపులు కోపాన్ని తెప్పించాయి.
దాసరి మాట్లాడేందుకు మైకు అందుకున్న సమయంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ కేకలు వేశారు.
కొంత సమయం వేచి చూసిన దాసరి ఏం మాట్లాడకుండా ఉన్నాడు.ఆ తర్వాత కూడా అరుపులు ఆగలేదు.
దాంతో ఆగ్రహించిన దాసరి తాను అల్లు రామలింగయ్య గారిపై ఉన్న అభిమానంతో ఈ ఆడియో వేడుకకు వచ్చాను.నాలాంటి పెద్ద వారు మాట్లాడుతున్నప్పుడు కాస్త మౌనంగా వినాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
మీరు ఇలా అరిస్తే మేము రావడం అనవసరం అనిపిస్తుంది అంటూ కఠువుగా మాట్లాడాడు.దాసరి మాటలకు కొంత సమయం పాటు ఆడిటోరియం మొత్తం కామ్ అయ్యింది.
అయితే ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మళ్లీ పవన్ కళ్యాణ్ అంటూ కేకలు వేశారు ఫ్యాన్స్.దాసరి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభిమానులను కించపర్చేలా దాసరి మాట్లాడాడు అంటూ ఫ్యాన్స్ విమర్శలకు దిగుతున్నారు.







