మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీ గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెల్సిందే.షూటింగ్ సమయంలోనే ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయినా ఏమాత్రం వెనుకాకడకుండా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాడు.
ఒక కొత్త హీరోతో సినిమా చేస్తున్నాను అనే విషయం మర్చి పోయాడో ఏమో కాని, ఈయన ‘రేయ్’ సినిమాకు ఏకంగా 45 కోట్ల బడ్జెట్‌ను పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్ కోసమే 2 కోట్లకు పైచిలుకు బడ్జెట్‌ను ఈయన కేటాయించాడు అంటే ఏ రేంజ్‌లో ఈయన ఖర్చు చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
ఒక కొత్త హీరోతో సినిమా చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.కొత్త హీరో అనే కాదు, ఎవరితో సినిమా చేసినా కూడా వారి స్థాయి, ఇమేజ్‌ను బట్టి సినిమాకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాని చౌదరి ఆ విషయాలను పట్టించుకోకుండా ఒక్క మెగా బ్రాండ్‌ను దృష్టిలో పెట్టుకుని డబ్బును నీళ్లల ఖర్చు చేశాడు.అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంత కాలం విడుదలకు నోచుకోని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా తర్వాత అయినా చౌదరి బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.







