ఆశగా 'ఎదురుచూపు'

పవన్ కల్యాణ్.ఈ సినీ పవర్ స్టార్.

 Fans Looking To Pawan Kalayn-TeluguStop.com

ఎన్నికలకు ముందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఒకానొక సమయంలో తన పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుందేమో అన్న భయాన్ని కూడా కలిగించాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా క్రేజ్ ఉంది.ఇక ఈ క్రేజ్ తో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడితే తిరుగు ఉండదు అన్న వార్త బలంగా వినిపిస్తున్నప్పటికీ పవన్ మాత్రం మౌనం గా ఉన్నాడు.

తన సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.ఇక మరో పక్క పవన్ ఫ్యాన్స్ అంతా రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారు.

ఇప్పుడున్న కుళ్ళును కడిగేసి కొత్త యువ రక్తంతో రాజాకీయాలను శుద్ది చేయాలి అని అనుకుంటున్నారు.అయితే పవన్ మాత్రం దానికి విరుద్దంగా రాజకీయాల గురించి మాట్లాడకుండా, తన పార్టీపై దృష్టి పెట్టకుండా…ఎప్పుడో ఒకటీ అరా ట్వీట్లు పెట్టడం మినహా పెద్దగా పొలిటికల్ ఇష్యూస్ పై స్పందించడంలేదు.

పోనీ అలాగని పవన్ స్పందించేందుకు సమస్యలే లేవా అంటే.అదీ లేదు.

పవన్ వైఖరి చూసిన వాళ్లు ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియనా.పార్టీ టైమరా అని సెటైర్లు వేసుకుంటున్నారు.

మరి పవన్ రైతులకు చెప్పినట్లు 2017తర్వాత ఫుల్ టైమ్ పాలిటీషియన్ గా మారతాడా అనేది ఆయనకే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube