తమిళ హీరో ధనుష్ తెలుగు మీడియాపై విరుచుకు పడ్డాడు.దీనికి గల కారణాలు అనేకం ఉన్నాయి అంటుంది టాలీవుడ్.
ధనుష్ నటించిన రఘువరన్ బీటేక్ సినిమా తెలుగులో కూడా విజయ వంతం కావడంతో ధనుష్ నటించిన కోలీవుడ్ సినిమాలను వరుస పెట్టి టాలీవుడ్ లో డబ్ చేస్తున్నారు.ఈ పద్ధతిలోనే ధనుష్ నటించిన ఒక తమిళ సినిమాను తెలుగులో ‘అనేకుడు’ పేరుతో డబ్ చేస్తున్నారు.
‘రంగం’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కెవి.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
క్రేజీ బ్యూటీ అమేరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో కార్తిక్ కూడా ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నాడు.ఈ సినిమా తెలుగు వర్షన్ పాటల ఆడియో వేడుక ఈమధ్య హైదరాబాద్ లో జరిగింది.
ఈ వేడుకకు మీడియా ప్రతినిధులు అంతా వచ్చి సందడి చేయడమే కాకుండా ధనుష్ పై అనేక ప్రశ్నలు వేసారు.చాల సమయం ఒపికతోనే సమాధానాలు చెప్పిన ధనుష్ తన సహనం నశించి ఒక్కసారిగా మీడియా వారి పై కోపాన్ని ప్రదర్శించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణం ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు మీడియా ప్రతినిధులు ధనుష్ కు ఎంతో క్రేజ్ తెచ్చిన ‘కొలవరి’ పాటను పాడమని గట్టిగా బలవంతం చేసారని టాక్.దీనితో సహనం నశించిన ధనుష్ తనకు ఈ కొలవరి పాట తనకు టార్చర్ గా మారిందని తాను ఎక్కడకు వెళ్ళినా ఈ పాట పాడమని అడుగుతూ ఉండటంతో విసిగి పోతున్నానని కామెంట్ చేసినట్లు టాక్.
ఏమైనా టాప్ హీరో అన్నాక కొంచెం సహనం ఉండాలి కదా.







