వివాదాల్లో బాహుబలి రికార్డ్!!

ప్రముఖ దర్శకుడు బాహుబలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్రంపై రోజుకో వివాదం రాజుకుంటుంది.విషం ఏమిటంటే.

 Maala Cast Filed Case Against Baahubali Movie-TeluguStop.com

రాజమౌళి ‘బాహుబలి’ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.ఈసినిమాకు సంబంధించి ఈమధ్య లీక్ అయిన దృశ్యాలలో దళితులను కించపరిచే దృశ్యాలు ఉన్నాయి అంటూ మరో కొత్త వివాదం తెర పైకి వచ్చింది.

ఈసినిమాకు సంబంధించి ఫైనల్ కాపీ కూడా తయారుకాని నేపధ్యంలో ఇటువంటి వివాదాలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.అంతేకాదు ఈమధ్య లీక్ అయిన ఈసినిమా వీడియోలో కావాలని ఎవరైనా ఇటువంటి సంభాషణలు సృష్టించారా అనే అనుమానం కూడా చాలామందికి వస్తోంది.

ఈ వార్తల నేపధ్యంలో ‘బాహుబలి’ సినిమా పై పలు దళిత సంఘాలు ట్యాంక్ బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసనలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు ఈసినిమా దర్శక నిర్మాతలు దళితులకు క్షమార్పణ చెప్పాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది.

అంతేకాదు ఈ చిత్రంలోని ఈ సన్నివేశాల పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.సామాన్యంగా సినిమా విడుదల అయ్యాక ఇటువంటి వివాదాలు రావడం సహజం.

కానీ బాహుబలికి మాత్రం ఇంకా విడుదల కాకుండానే ఈ తలనొప్పులు ఎక్కువయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube