సిద్దు, సమంతలు నో చెప్పారు

సిద్దు, సమంతల ప్రేమ వ్యవహారం ఒక సినిమాపై పడేలా ఉంది.

వీరిద్దరు బ్రేకప్‌ అవ్వకముందు మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్‌’ తెలుగు మరియు తమిళ రీమేక్‌లలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

త్వరలోనే ఈ రీమేక్‌ షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు నిర్మాత దిల్‌రాజు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు.ప్రస్తుతం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.

అయితే ఈ క్రమంలో వీరిద్దరు కూడా రీమేక్‌లో నటించలేమని తేల్చి చెప్పారు.వీరి లవ్‌ బ్రేక్‌అప్‌ అయిన తర్వాత ఆ రీమేక్‌లో నటించేందుకు ఏం అభ్యంతరం లేదని నిర్మాతలకు ఈ ఇద్దరు కూడా హామీ ఇచ్చారట.

ఇదే విషయాన్ని దిల్‌రాజు కూడా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.అయితే తాజాగా సిద్దార్థ్‌ ‘బెంగళూరు డేస్‌’ చిత్రం రీమేక్‌లో నటించాలని తాను కోరుకోవడం లేదని ట్వీట్‌ చేశాడు.

Advertisement

ఆ తర్వాత సమంత కూడా తానూ ఆ రీమేక్‌లో నటించడం లేదని ప్రకటించింది.దాంతో ఇప్పుడు ఆ సినిమాపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వీరద్దరు కూడా తప్పుకోవడంతో మరో జంట కోసం హంట్‌ చేస్తారా లేక ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని పక్కకు పెడతారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు