ఆంధ్ర ప్రదేశ్ సీ.యీ.
ఓ గా పిలవబడే చంద్రబాబు నాయుడికి తీవ్ర అవమానం జరిగింది.హైదరాబాద్ ను తీసుకెళ్ళి ప్రపంచ పటంలో పెట్టిన ఆయన్ని, ప్రపంచ దేశాలకు అధినేత అయిన అమెరికా అధ్యక్షున్ణి కలిసే అవకాశం దక్కకుండా చేశారు కేంద్రం వారు.
విషయం ఏమిటంటే నిన్న అమెరికా అధ్యక్ష్యుడు ఒబామా ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇదిలా ఉండగా.ఆయనను విశాఖకు తీసుకురావాలని భావించారు ఏపీ ప్రభుత్వం వారు.ఒబామా తమ రాష్ట్రంలో పర్యటిస్తే అది తమ వ్యక్తిగత ఇమేజ్ కు చాలా ఉపయుక్తంగా ఉంటుందనేది బాబు గారి ఆలోచన.
అయితే ఒబామా కొన్ని గంటల సేపు మాత్రమే ఇండియాలో ఉండటం.రిపబ్లిక్ డే ఉత్సావాల్లో పాల్గొని తన దారిన తాను వెళ్లిపోతుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తీవ్రమైన నిరాశే కలిగింది.
అయితే అక్కడికీ చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఒబామాతో మీట్ కావడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఒబామాకు ఇచ్చే విందుకు హాజరైతే ఒబామాను కలిసే అవకాశం దక్కుతుంది.
అందుకోసం కేంద్రం నుంచి ఏమైనా ఆహ్వానం అందుతుందా? అని కూడా బాబు గారు ఒక లుక్కేసినట్టుగా తెలుస్తోంది.అయితే అది జరగలేదు! ఈ విషయంలో బాబు తరపున ఏపీ ప్రభుత్వ అధికారులు ట్రై చేశారట.
అయితే చివరకు మాత్రం అది దక్కనట్టుగా తెలుస్తోంది.దీంతో ఇక చేసేది లేక బాబు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి విజయవాడ వెళ్లిపోయాడని టాక్.
ఒకవేళ రాష్ట్రపతి భవన్ లో జరిగే విందులో పాల్గొనే అవకాశం దక్కి ఉంటే బాబు అమితంగా ఆనందపడే వాడేమో.పాపం అదే జరిగి ఉంటే మాత్రం బాబు ఇమేజ్ మరింత పెరిగేది.







